ఓ పరువు నష్టం కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు జారీ

ఓ పరువు నష్టం కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు జారీ

పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఓ పరువు నష్టం కేసులో నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో ముందస్తు విచారణ చేపట్టాలని పీఎంఎల్-ఎన్ పార్టీ చీఫ్ షాబాజ్ షరీఫ్ ఓ స్థానిక కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఇమ్రాన్‌కు నోటీసులు జారీ చేసింది. షాబాజ్ షరీష్ పెద్దన్నయ్య.. పాక్ మాజీ ప్రధాని షరీఫ్‌పై సుప్రీంకోర్టులో దాఖలైన పనామా పేపర్ల కేసును వెనక్కు తీసుకుంటే 61 మిలియన్ డాలర్లు ఇస్తామని షాబాజ్ తనకు ఆఫర్ చేశారని 2017లో ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇద్దరికీ తెలిసిన కామన్ ప్రెండ్ తో రాయభారం పంపిచారని అప్పట్లో చెప్పిన ఇమ్రాన్.. ఆ ప్రెండ్ పేరుమాత్రం చెప్పలేదు. దీంతో షాబాజ్ షరీఫ్.. ఇమ్రాన్ ఖాన్ పై పరువునష్టం దావా కేసు అప్పట్లో వేశారు. దీనిపై మూడేళ్లుగా ఇమ్రాన్ రాతపూర్వకంగా సమాధానం చెప్పలేదని.. దీంతో ఈ కేసు ముందుకు సాగలేదని.. దీనిపై విచారణ జరిపించాలని షరీఫ్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. షరీఫ్ పిటిషన్ పై స్పందించిన కోర్టు ఇమ్రాన్ కు నోటీసులు జారీ చేసింది. నవాజ్ షరీఫ్ ను పనామా పేపర్ల కేసులో ప్రధానిమంత్రి పదవి నుంచి పాక్ సుప్రీంకోర్టు తొలగిస్తూ.. తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story