కేరళలో ఏనుగు హత్యోదంతంపై సంచలన విషయాలు

కేరళలో ఏనుగు హత్యోదంతంపై సంచలన విషయాలు

కేరళలో ఏనుగు హత్యోదంతంపై సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గర్భిణీ ఏనుగు ఎలా మరణించిందో, చనిపోయే ముందు ఎంత నరకయాతన అనుభవించిందో పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటపెట్టింది. పైనాపిల్ బాంబ్ తిన్న 14 రోజుల తర్వాత ఏనుగు చనిపోయిందని శవపరీక్ష రిపోర్ట్ పేర్కొంది. ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్లే ఏనుగు ప్రాణాలు కోల్పోయిందని పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ స్పష్టం గా తెలిపింది. ఐతే, ఆ 14 రోజుల పాటు ఆ ఏనుగు ఏమీ తినలేదు. బాంబు పేలుడు కారణంగా నోటికి తీవ్ర గా యం కావడంతో ఆ ఎలిఫెంట్ ఏమీ తినలేకపోయింది. కడుపులో బిడ్డ ఆకలి బాధను తీర్చ లేక, తన క్షుద్బాధను తీర్చుకోలేక నరకయాతన అనుభవించింది. కనీసం నీళ్లు కూడా తాగలేకపోయింది. ఆహారం, నీళ్లు తీసుకోలేక ఆకలితో అలమటించిపోయింది. చివరికి నీరసించిపోయి నీటిలోనే పడిపోయింది. వెల్లియార్ నదిలోనే ప్రాణాలు విడిచింది.

ఇక, ఏనుగు హత్య కేసులో కేరళ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిద్దరు ఒక ఫామ్‌హౌస్‌లో కూలీలుగా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఎలుగుబంట్లు పంట పొలాలను నాశనం చేస్తున్నాయ నే కారణంతో వాటిని హతమార్చడానికే పైనాపిల్‌లో టపాసులు పెట్టినట్లు నిందితులు చెబుతున్నారు. ఐతే, మరో ఏనుగు మృతిపై అనుమానాలు వస్తుండడంతో ఇదేమైనా మాఫియానా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మరికొందరిపై కూడా అనుమానాలున్నాయని, సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత వారిని కూ డా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. బాధ్యులపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కేరళలో మలప్పురంలో ఏనుగు మృతిపై దేశ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. రతన్‌టాటా వంటి పారిశ్రామికవేత్త లు కూడా ఏనుగుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం కూడా సీరియస్‌గా స్పందించడంతో కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Tags

Read MoreRead Less
Next Story