పెళ్లి పైకి మనసు పోతోందా మాధవీ.. పోస్ట్ వైరల్

పెళ్లి పైకి మనసు పోతోందా మాధవీ.. పోస్ట్ వైరల్
X

ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హడావిడి కనిపిస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్లి బాట పడుతున్నారు. వారి పెళ్లిళ్లు చూసి నటి మాధవీలతకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో. ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్ట్ చూస్తే అలానే ఉంది మరి. సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన మాధవి సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. తన అభిప్రాయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె పోస్ట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

'చాలా కాలం తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభమైంది. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నా జీవితంలో కూడా ఇప్పుడు అద్భుతం జరిగింది. దాంతో నేను చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను. నా సంతోషానికి కారణం ఏంటనేది త్వరలో వివరిస్తాను' అని మాధవీలత పేర్కొన్నారు. ఇక ఆపోస్ట్ చూసి అభిమానుల ప్రశ్నల పరంపర మొదలైంది. ఏంటి మేడమ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా అని కొందరడిగితే, మరి కొందరు ప్రేమలో పడ్డారా.. పెళ్లి చేసుకుంటున్నారా అని అడుగుతున్నారు. కాగా, మాధవీ లత నచ్చావులే, స్నేహితుడా వంటి చిత్రాల్లో నటించి అభిమానులకు దగ్గరైంది.

Next Story

RELATED STORIES