కొనసాగుతున్న భారత్, చైనా ఆర్మీ జనరల్స్ సమావేశం

కొనసాగుతున్న భారత్, చైనా ఆర్మీ జనరల్స్ సమావేశం
X

తూర్పు లడఖ్‌లో తాజా సరిహద్దు షోడౌన్‌ను ముగించే ప్రయత్నంలో భాగంగా చైనా, ఇండియన్ జనరల్స్ శనివారం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) లోని హిమాలయన్ అవుట్‌పోస్ట్‌లో సమావేశమయ్యారు. ఉదయం 11 గంటల నుండి చుషుల్-మోల్డో బోర్డర్ మీటింగ్ పాయింట్ వద్ద ఈ సమావేశం జరుగుతోంది. భారత అధికారుల ప్రతినిధి బృందానికి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, చైనా మిలిటరీకి మేజర్ జనరల్ లిన్ లియు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా లియు సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ జోన్ కమాండర్ గా ఉన్నారు. విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి వారు సంకల్పించారు. అంతకుముందు శుక్రవారం సాయంత్రం, ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల అధికారుల మధ్య సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

Next Story

RELATED STORIES