ఏనుగు ఘటన వ్యవహారంలో మేనకాగాంధీపై కేసు

ఏనుగు ఘటన వ్యవహారంలో మేనకాగాంధీపై కేసు
X

టపాకాయల్లో ఉండే పేలుడు పదార్థాలు ఉన్న పైనాపిల్ ను ఓ ఏనుగుకు గుర్తు తెలియని వ్యక్తి తినిపించడంతో.. ఆ ఏనుగు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై కేరళ సీఎం విజయన్ పినరయ్ దర్యాప్తుకు ఆదేశించడంతో ఇప్పటికే ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ అంశంపై బీజేపీ సీనియర్ నేత మేనకాగాంధీపై కేసు నమోదైంది. సోషల్ మీడియాలో మేనకా గాంధీ పెట్టిన ఫోస్టులు మలప్పురం జిల్లాను, జిల్లావాసులను కించపరిచేలా ఉన్నాయని సుభాష్ చంద్రన్ అనే అడ్వకేట్ ఒకరు ఆమెపై ఫిర్యాదు చేశారు. బుధవారం మేనకాగాంధీ ట్వీటర్ వేధికగా ఏనుగు ఘటనపై స్పందిస్తూ.. మలప్పురం జిల్లాలో జంతువులపై అమానుషంగా ప్రవర్తిస్తూ ఉంటారని.. కానీ, ఇప్పటివరకూ ఒక్కనేరస్తుడిపై కూడా చర్యలు తీసుకోవలేదని ట్వీట్ చేశారు. ఏనుగు ఘటన జరిగింది మలప్పురం జిల్లాలో కాదని.. పాలక్కడ్ జిల్లాలో అని సుభాష్ చంద్రన్ అనే అడ్వకేట్ వివరణ ఇస్తూ.. మేనకాగాంధీ ట్వీట్ తమ ప్రాంతాన్ని, ప్రజలను కించపరిచేలా ఉందని సుభాష్ చంద్రన్ అనే వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఏనుగు ఘటనపై మతం రంగుపులిమేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. ముస్లిం ప్రజలు ఎక్కవగా ఉన్న మలప్పురం జిల్లాపై దుష్ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు.

Next Story

RELATED STORIES