మెక్సికోలో పోలీస్ అధికారికి నిప్పంటించిన నిరసనకారులు

మెక్సికోలో పోలీస్ అధికారికి నిప్పంటించిన నిరసనకారులు

మెక్సికోలో కొందరు నిరసనకారులు ఓ పోలీస్ అధికారికి నిప్పంటించారు. మాస్కు వేసుకోలేదని ఓ వ్యక్తిని పోలీసులు కొట్టి చంపేశారని అల్లర్లు జరుగుతున్నాయి. మాస్కు వేసుకోలేదని ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత కొంత సమయానికి ఆ వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులే కొట్టి చంపేశారని ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే, ఈ క్రమంలో నిరసనకారులు ఓ పోలీసు అధికారికి నిప్పంటించారు. దీంతో మిగతా పోలీసులు అంతా వచ్చి మంటలు ఆర్పి.. ఆ అధికారిని ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story