వాళ్లకు డబ్బు చెల్లించలేదు.. బతుకెలా? : ప్రియాంక గాంధీ

ఉత్తర ప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వం చెరకు రైతులకు బకాయిలు చెల్లించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం ఆరోపించారు. 14 రోజుల్లో చెల్లింపులు చేయాల్సి ఉన్నా.. బిజెపి ప్రభుత్వం మౌనంగా కూర్చునిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ముజఫర్ నగర్ జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారని.. వార్తలను ఉటంకిస్తూ యుపి ప్రభుత్వంపై మాటల దాడి చేశారు.
దీనిపై ప్రియాంక గాంధీ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ, ఇలా అన్నారు 'తన చెరకు పంట పొలంలో ఎండిపోతుండటం, ఎంతకీ స్లిప్ రాకపోవటం చూసి ముజఫర్ నగర్ చెరకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 14 రోజుల్లో పూర్తి చెల్లింపు ఇస్తామని బిజెపి ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ వేలాది కోట్ల రూపాయలను నొక్కడం ద్వారా చక్కెర మిల్లులు మూతపడ్డాయి. ఈ విషయంపై రెండు రోజుల క్రితం ప్రభుత్వాన్ని హెచ్చరించాను. ఈ ఆర్థిక సంక్షోభ సమయంలో డబ్బులు తీసుకోని రైతు కుటుంబాలకు ఏమి జరుగుతుందో ఆలోచించండి.' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com