28 వేల మందికి ఆహారం.. నిసర్గ బాధితులకు సోనూ సాయం

28 వేల మందికి ఆహారం.. నిసర్గ బాధితులకు సోనూ సాయం
X

వలస కార్మికులను ఆదుకుని పెద్దమనసు చాటుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్.. తాజాగా నిసర్గ తుఫాను బాధితులకు అండగా నిలిచారు. దీనిపై ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం మనమంతా తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటున్నాం. ఒకరికి ఒకరు అండగా నిలబడాలి. ఇప్పటి వరకు నేను, నా బృందం 28 వేల మందికి ఆహారాన్ని సరఫరా చేశాం. తుఫాను బాధితులందరినీ స్థానిక పాఠశాల, ప్రభుత్వ కళాశాల భవనాలకు తరలించి ఆశ్రయం కల్పించాం. వారంతా సురక్షితంగా ఉండేలా చూస్తున్నామని పేర్కొన్నారు. ముంబైలో చిక్కుకుపోయిన 200 మంది అసోం వాసులకు షెల్టర్ ఏర్పాటు చేసినట్లు సోనూ తెలిపారు.

Tags

Next Story