ముంబైలో విమానాన్ని ఢీకొన్న నిచ్చెన.. ధ్వంసమైన రెక్కలు

ముంబైలో విమానాన్ని ఢీకొన్న నిచ్చెన.. ధ్వంసమైన రెక్కలు
X

శనివారం ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. స్పైస్‌ జెట్ విమానం నిచ్చెన.. అక్కడే ఆగి ఉన్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ఇండిగో విమానం రెక్కలు, ఇంజిన్‌ను కప్పి ఉంచే భాగం ధ్వంసమైంది. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో బలమైన గాలుల కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బలమైన

గాలుల కారణంగా నిచ్చెన ఉన్న ప్రాంతం నుంచి వెనక్కి జరిగి ఇండిగో విమానం రెక్కకి తగిలి విరిగిపోయినట్లు ప్రస్తుతం వివిధ వెబ్సైట్లలో కనపడుతున్న ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఈ సంఘటనపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా శనివారం వీచిన ఈదురుగాలులు, అధిక వర్షపాతంతో ముంబై నగరం జలమయమైన విషయం తెలిసిందే.

Next Story

RELATED STORIES