వావ్ సూపర్ ఐడియా.. ఐఫోన్ తో గోడ..

వావ్ సూపర్ ఐడియా.. ఐఫోన్ తో గోడ..

ఐ ఫోన్ వాడుతున్నారంటే మీరు మామూలు వ్యక్తులు కాదండి.. మహా రిచ్ పర్సన్స్ అయి ఉంటారు. దాని రేటు అలానే ఉంటుంది మరి. వాటితో గోడకట్టడం ఏంటి.. అదే కదా వార్త. వాడేసిన వస్తువులను పడేయకుండా పలు రకాలుగా వినియోగిస్తుంటారు అభిరుచీ, ఆసక్తి ఉన్నవారు. అందరూ ఆశ్చర్యపోయేలా పాత వస్తువులకు కొత్తగా మార్చేస్తుంటారు. రోజుకో కొత్త మోడల్ ఫోన్ మార్కెట్లోకి వస్తుంటే పాత వాటిని పడేయకుండా ఇలా చేశాడేమో. ఏదేమైనా ఐఫోన్ వాల్ సూపర్ గా ఉందంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన వారు.

వియత్నాంకు చెందిన ఓ టిక్ టాక్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఇప్పటి వరకు ఈ వీడియోను 1.7 మిలయన్లకు పైగా చూశారు. తన ఇంటి ప్రహరీ గోడకు టైల్స్ బదులు ఐఫోన్-6 వాడేశాడు. ఆపిల్ సంస్థ ఈ మోడల్ ఫోన్లను ఎప్పుడో నిలిపేసింది. వాటి అప్ డేట్స్ కూడా రావట్లేదు. దీంతో ఫోన్ వినియోగదారులు వాడకుండా ఉంచిన ఆ ఫోన్లను తీసుకుని గోడ కట్టడానికి ఉపయోగించి ఉంటాడు. ఏదేమైనా ఐడియా సూపర్ గా ఉంది గురూ అంటున్నారు నెటిజన్స్.

Tags

Read MoreRead Less
Next Story