కరోనా కాలంలో కలుషిత ఆహారానికి చెక్.. డబ్ల్యుహెచ్ఓ పంచ సూత్రాలు

కరోనా కాలంలో కలుషిత ఆహారానికి చెక్.. డబ్ల్యుహెచ్ఓ పంచ సూత్రాలు

కలుషిత ఆహారం తింటే కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు అని తెలిసి కూడా అదే తినాలని ఉంటుంది. అమ్మ పెట్టిన ఫుడ్డు మాత్రమే తింటే ఆకలి తీరదు. రోడ్డు మీద దొరికే అడ్డమైన గడ్డీ తినాల్సిందే.. అలాంటి వాటన్నిటికీ కరోనా చెక్ పెట్టిందని అనుకుంటున్నాము. మరి ఇలా ఎన్ని రోజులు పాటిస్తారో తెలియదు కానీ తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కలుషిత ఆహారం తినడం వల్ల ఏటా ప్రతి పదిమందిలో ఒకరు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపింది. మొత్తంగా చూస్తే 4,20,000 మంది మరణిస్తున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ఈ ముప్పు మరీ ఎక్కువ. కలుషిత ఆహారంతిని మరణించే చిన్నారుల సంఖ్య 1,25,000. అపరిశుభ్ర వాతావరణంలో తయారయ్యే ఆహారాన్ని తీసుకోకుండా ఉంటే 200 రోగాలను అరికట్టవచ్చంటున్నారు వైద్యులు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఐదు సూత్రాలు..

వంట గదిలోకి వెళ్లిన ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వంటగది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. తడి లేకుండా చూసుకోవాలి.

నిల్వ ఆహార పదార్ధాలను వీలైనంత వరకు తీసుకోకుండా ఉంటే మంచిది.

వండిన, వండని ఆహార పదార్థాలను వేర్వేరు డబ్బాలలో నిల్వ చేసుకోవాలి.

ఆహారాన్ని బాగా ఉడికించి తీసుకోవాలి. అప్పుడే క్రిములు నశిస్తాయి. పోషకాల స్థాయి పెరుగుతుంది.

శుభ్రమైన నీటిని ఉపయోగించి ఉప్పు నీటిలో కూరగాయలు కడగాలి.

ఈ ఐదు సూత్రాలు పాటిస్తూ అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త వహించ మంటోంది డబ్ల్యుహెచ్ఓ.

Tags

Read MoreRead Less
Next Story