కరోనా ఎఫెక్ట్.. సొంత ఇంటి కల నెరవేరేనా.. ధరల పరిస్థితేంటి?

కరోనా ఎఫెక్ట్.. సొంత ఇంటి కల నెరవేరేనా.. ధరల పరిస్థితేంటి?
X

లాక్డౌన్ కి ముందు ఎన్నో కలలు.. మరెన్నో ఆశలు.. సొంత ఇల్లు కొనుక్కోవాలని ఈ అద్దెల బాధ నుంచి బయటపడొచ్చని.. ఇప్పుడు కొందామంటే రేటు ఎలా ఉంటుందో అని భయం. ఇదే విషయంపై బిల్డర్లు సమాలోచనలు జరుపుతున్నారు. కరోనా ప్రభావం తగ్గితే మళ్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ అనంతరం మార్కెట్ కార్యకలాపాలు మొదలయ్యాయని అన్నారు. ఇల్లు కొనాలనుకునే వారు ముందుకొస్తున్నారని అన్నారు. వడ్డీ రేట్లు తగ్గడం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రుణ ఆధారిత సబ్సిడీ పథకం వంటివాటితో వినియోగ దారులు ఇల్లు కొనాలనే ఆలోచనవైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.

ఇదివరకే ఇంటి కొనుగోలుకు సంబంధించి కొంత మొత్తం కట్టి ఉంటారు. కాబట్టి వాటి ధరలు తగ్గే అవకాశం లేదు. అయితే కూలీల వ్యయం పెరిగే అవకాశం ఉంది. వారు తమ స్వస్థలాలకు వెళ్లి పోయారు. ఉన్న వారితో పని చేయించాల్సి ఉంటుంది. దాంతో ప్రాజెక్టు జాప్యం జరుగుతుంది. నిర్మాణ దారులకు వడ్డీ భారం పడుతుంది. 70 శాతం వరకు పూర్తయిన వెంచర్లలో ధరలు తగ్గే అవకాశం లేదు. కానీ 10 నుంచి 30 శాతం పనులు పూర్తైన ప్రాజెక్టుల్లో అవకాశాన్ని బట్టి ధరలు తగ్గించే అవకాశం ఉంది. కొత్తగా వెంచర్ కు అనుమతులు పొందిన వారు ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కొనుగోళ్లను బట్టి వీరు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

బుకింగ్స్ త్వరగా పూర్తయితే వెంచర్ నిర్మాణం సత్వరం జరుగుతుంది. ఇళ్లను విక్రయించకుండా లాభం కోసం వేచి చూసే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఏ మాత్రం అవకాశం ఉన్నా తగ్గించి ఇవ్వడానికే చూస్తున్నారు. ఇక ప్రభుత్వం నుంచి కూడా ప్రొత్సాహాలు పెంచితే కొనుగోలు దారులు ముందుకు వస్తారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన రుణ ఆధారిత సబ్సీడీ పథకం ప్రస్తుతం గరిష్టంగా రూ.2.69 లక్షలు కొనుగోలు దారులకు ఇస్తోంది. అది రూ.4లక్షలకు పెంచితే ఉపయుక్తంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని మినహాయించాలి. ఈ విధమైన మార్పులు జరిగితే చాలా మంది వెంటనే ఇల్లు కొనే నిర్ణయం తీసుకుంటారు. సర్కారుకీ ప్రయోజనం ఉంటుంది.

Next Story

RELATED STORIES