అమితాబ్, మాధురీ కలిసి ఒక్క సినిమాలోనూ నటించలేదు.. కారణం!!

అమితాబ్, మాధురీ కలిసి ఒక్క సినిమాలోనూ నటించలేదు.. కారణం!!
X

అవునూ బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అందాల తార మాధురీ దీక్షిత్ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదేంటి.. ఇరువురి అభిమానులను చాలా ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఇది. అయితే దీని వెనుక పెద్ద కదే ఉందట. అదేంటంటే.. 80వ దశకంలో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన మాధురి పలువురు స్టార్ హీరోలతో జత కట్టింది. కానీ అగ్రహీరో అమితాబ్ తో ఒక్క సినిమాలోనూ నటించలేదు.

మాధురికి కెరీర్ ఆరంభించిన కొత్తలో అన్నీ పరాజయాలే పలకరించాయట. దీంతో ఆమెతో కలిసి నటించేందుకు హీరోలెవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో అనిల్ కపూర్ మాధురికి అవకాశం ఇచ్చాడు. ఇద్దరూ కలిసి నటించిన బేటా, తేజాబ్, హిఫాజత్, పరిందా వంటి సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లయ్యాయి. దాంతో మాధురి రేంజ్ పెరిగిపోయింది. అప్పుడు అమితాబ్ తో నటించే అవకాశం వచ్చినా అనిల్ కపూర్ అడ్డు చెప్పాడట.

నేను మాధురిని స్టార్ హీరోయిన్ చేశాను. నాతో తప్ప అమితాబ్ తో నటించడానికి వీల్లేదని షరతు పెట్టాడట. అనిల్ కపూర్ మాటను మాధురి కూడా కాదనలేకపోయింది. అందువల్లే బిగ్ బీతో నటించే అవకాశాన్ని మాధురి కోల్పోయింది. ఆ సంఘటన తరువాత అనిల్ తో కూడా మాధురి నటించ లేదు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత గత ఏడాది టోటల్ ఢమాల్ అనే చిత్రంలో అనిల్ కపూర్, మాధురి కలిసి నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

Next Story

RELATED STORIES