రాజ్యసభ ఎన్నికలకు ముందు బీజేపీ హార్స్ ట్రేడింగ్ మొదలుపెట్టింది : కాంగ్రెస్

రాజ్యసభ ఎన్నికలకు ముందు బీజేపీ హార్స్ ట్రేడింగ్ మొదలుపెట్టింది : కాంగ్రెస్

రాజ్యసభ ఎన్నికలకు ముందే గుజరాత్ ఎమ్మెల్యేల్లో ఆరుగురు రాజీనామా చేయడంతో భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వెనుక బీజేపీ హస్తముందని ఆరోపిస్తోంది. అంతేకాదు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ హార్స్ ట్రేడింగ్ మొదలుపెట్టిందని ఆ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్వి కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విరుచుకుపడ్డారు.. వైరస్ వ్యాప్తి సమయంలో అమిత్ షా ఎక్కడున్నారో తెలియలేదని,

అయితే రాజ్యసభ ఎన్నికలు ప్రకటించిన వెంటనే ఆయన యాక్టీవ్ అయ్యారని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. కాగా గత రెండు రోజులలో ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో గుజరాత్‌ కాంగ్రెస్ పార్టీ షాక్ కు గురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జా శుక్రవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు జూన్ 3 న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్, జితు చౌదరి తమ రాజీనామా లేఖలను స్పీకర్ రాజేంద్ర త్రివేదికి అందజేశారు.

Tags

Read MoreRead Less
Next Story