జూన్ 8నుంచి మాల్స్ ఓపెన్.. ఈ రూల్స్ పాటిస్తే సరి .. లేదంటే షట్ డౌన్..

జూన్ 8నుంచి మాల్స్ ఓపెన్.. ఈ రూల్స్ పాటిస్తే సరి .. లేదంటే షట్ డౌన్..

గత రెండు నెలల నుంచి మూసి ఉన్న మాల్స్ జూన్ 8నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు అనుసరిస్తూ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రూల్స్ పెట్టింది. మరో రెండు రోజుల్లో మాల్స్, దేవాలయాలు తెరవచ్చని చెబుతూనే టోకెన్ తీసుకునే వారినే లోపలికి అనుమతించాలి. మాల్స్ లో బట్టలు ట్రయల్ చేయడానికి వీలు లేదని సర్కారు స్పష్టం చేసింది. ఇక ఆలయాల్లో తీర్ధ ప్రసాదాలు పంపిణీ చేయకూడదని తెలిపింది. ఎక్కడైనా ఆరడుగుల దూరం కచ్చితంగా పాటించాలని పేర్కొంది. మాల్స్ కి వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story