తాజా వార్తలు

జీహెచ్ఎంసీ పరిధిలో పదవతరగతి పరీక్షలు వాయిదా..

జీహెచ్ఎంసీ పరిధిలో పదవతరగతి పరీక్షలు వాయిదా..
X

అసలు పదవతరగతి పరీక్షలు జరుగుతాయా లేదా అనే తర్జన భర్జన ల నడుమ హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. అయితే కరోనా వ్యాప్తిని కట్టడి చేసే నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో పది పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ మినహా మిగతా చోట్ల పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ పరిధిలోని వారికి సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తించాలని చెప్పింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల విద్యార్థులకు పరీక్షలకు అనుమతించాలని కోర్టును ప్రభుత్వం కోరింది. అయితే విద్యార్థులకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.

Next Story

RELATED STORIES