Top

ఒడిశాలో కూలిన ట్రైనీ విమానం.. ఇద్దరు మృతి

ఒడిశాలో కూలిన ట్రైనీ విమానం.. ఇద్దరు మృతి
X

ఒడిశాలోని డెంకనాల్ జిల్లాలో సోమవారం రెండు సీట్ల విమానం కూలిపోయింది. దాంతో ట్రైనీ పైలట్ సహా ఆమె ట్రైనర్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని బీరసాలాలోని ప్రభుత్వ విమానయాన శిక్షణా సంస్థ (జిఐటిఐ) వద్ద టార్మాక్‌పై ట్రైనర్ విమానం కూలిపోయిందని డెంకనాల్ జిల్లా అదనపు మేజిస్ట్రేట్ బికె నాయక్ తెలిపారు.

ఇద్దరిని కామాఖ్యాయనగర్‌ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చనిపోయినట్లు ప్రకటించినట్లు బి.కె.నాయక్ తెలిపారు. ఇక ఘటన సమాచారం అందుకున్న సీనియర్ పోలీసులు, జిల్లా అధికారులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.

Next Story

RELATED STORIES