భారత్ లో 24 గంటల్లో 9,983 పాజిటివ్‌ కేసులు

భారత్ లో 24 గంటల్లో 9,983 పాజిటివ్‌ కేసులు

రెండు నెలలు లాక్డౌన్ చేసిన తర్వాత ప్రభుత్వం అనేక సడలింపులను అనుమతించినప్పటికీ, 24 గంటల్లో 9,983 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా గత 24 గంటల్లో 206 మంది మరణించారు. తాజా కేసులతో భారత్ లో కరోనావైరస్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 2.56 లక్షల కేసులను దాటాయి. ప్రభుత్వ డేటా ప్రకారం వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 7,135 గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 2,56,611 ఉండగా.. ఇందులో 1,24,095 మంది కోలుకున్నారు.

భారతదేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 48.35 శాతంగా ఉంది, అయితే ఇందులో వృద్ధి రేటు 3.89 శాతంగా ఉంది. మహారాష్ట్ర దేశంలోనే అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రంగా ఉంది.. మొత్తం 85,000 కేసులతో చైనా సంఖ్యను అధిగమించింది. రాష్ట్రంలో 3 వేలకు పైగా మరణించారు.. మహారాష్ట్ర రాజధాని ముంబై.. దేశంలో అత్యంత నష్టపోయిన నగరాల్లో ఒకటిగా ఉంది. ఆ తరువాత తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story