దేశంలో రెండున్నర లక్షలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో రెండున్నర లక్షలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య రెండున్నర లక్షలకు చేరింది. ఆదివారం వరుసగా 10,000 కి పైగా నివేదికలు పాజిటివ్ గా వచ్చాయి. గత 24 గంటల్లో గరిష్టంగా 10 వేల 768 మంది రోగులు కరోనా భారిన పడ్డారు. కాగా శనివారం 10 వేల 428 మంది పాజిటివ్ ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో కూడా, 15 రోజుల్లో రెండవసారి, 3 వేల కొత్త అంటువ్యాధులు పెరిగాయి. రాష్ట్రంలో వ్యాధి సోకిన వారి సంఖ్య 85 వేలు దాటింది. కారోనా నుండి ఇప్పటివరకు 3060 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఢిల్లీలోని పిఐబి అధికారి నివేదిక పాజిటివ్ గా వచ్చింది, శానిటైజ్ లో భాగంగా నేషనల్ మీడియా సెంటర్ ను సోమవారం మూసివేస్తున్నారు.

మహారాష్ట్రలోని 60 జైళ్లలో 11,000 మంది ఖైదీలను అత్యవసర పేరోల్‌పై విడుదల చేయాలని ఉద్ధవ్ ప్రభుత్వం నిర్ణయించింది. 9671 మంది ఖైదీలను ఇంతకు ముందు విడుదల చేశారు. రాష్ట్ర జైళ్లలో 38 వేల మంది ఖైదీలు ఉన్నారని హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అన్నారు. మరోవైపు కరోనా రోగుల విషయంలో తమిళనాడు రెండవ స్థానంలో ఉంది. 31 వేలకు పైగా పాజిటివ్‌లు ఇక్కడ కనుగొనబడ్డాయి. ఆర్థివరం రికార్డు స్థాయిలో 1515 పాజిటివ్ కేసులొచ్చాయి. తమిళనాడులో కరోనా సోకిన వారిలో 86% మందికి లక్షణాలు చూపించలేదని ముఖ్యమంత్రి పళనిసామి అన్నారు. ఇక్కడ జూన్ 4 వరకు 5.50 లక్షల పరీక్షలు జరిగాయని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story