ముక్కులు బద్దలయ్యే వాసన.. ముంబై నగరం ఆందోళన

ఏం వాసనో తెలియదు.. ముక్కులు బద్దలై పోతున్నాయంటూ ముంబై నగర వాసులు నగర పాలక సంస్థకు ఫిర్యాదులు చేశారు శనివారం సాయింత్రం. అసలే కరోనాతో వణికి పోతుంటే మళ్లీ ఇదేంట్రా దేవుడా అనుకుంటూ అధికారులు హుటా హుటిన సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఏ ఫ్యాక్టరీ నుంచైనా వ్యర్ధాలు వెలువడుతున్నాయా లేక కర్మాగారాల్లో గ్యాస్ లీకవుతోందా అని అన్వేషణ ప్రారంభించారు. కానీ ఎక్కడా అలాంటివేమీ కనిపించలేదు. దాదాపు 17 ఫైర్ ఇంజన్లు ఇదే పని మీద ముంబై నగర మూల మూలలు గాలించాయి.
వీటితో పాటు ప్రమాదకర రసాయనాలను పసిగట్టి నియంత్రించే హజ్మత్ వాహనాన్ని కూడా రంగంలోకి దించారు అధికారులు. ఆదివారం నాటికి ఇది గ్యాస్ లీక్ కాదని ఎక్కడి నుంచి వస్తోంది.. ఏంటీ అనేది అర్థం కాకుండా ఉందని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. అయితే ఎటువంటి భయాందోళనకు గురి కావొద్దని మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రజలకు సూచించారు. గత సంవత్సరం కూడా ఇదే తరహా వాసనతో ముంబై వాసులు ఇబ్బంది పడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com