దర్శకులు ధీరులూ .. మీకు ఈ సత్తా ఉందా..?

దర్శకులు ధీరులూ .. మీకు ఈ సత్తా ఉందా..?

తెలుగు సినిమా పరిశ్రమలో అనూహ్యమైన మార్పులుచోటు చేసుకుంటున్నాయి. కరోనా, లాక్ డౌన్ టైమ్ లో ఎవరికి వారు సర్వైవల్ కోసం ప్రయత్నాలు చేస్తే కొందరు దర్శకులు మాత్రం రాజమౌళి నాయకత్వంలో ఇండస్ట్రీ రెండుగా చీల్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇండస్ట్రీలో 24 శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖకూ ఓ సంఘం ఉంది. ఈ అన్నిటికీ కెప్టెన్స్ అయిన దర్శకులకూ ఓ సంఘం ఉంది. ఈ సంఘం నిరంతరం బానే పనిచేస్తుంది అని మినిమం అవగాహన ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. కానీ ఈ సంఘాన్ని కాదని రీసెంట్ గా రాజమౌళి నాయకత్వంలో కొందరు దర్శకులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దీనికి దర్శకుల సంఘానికి ఆహ్వానం లేదు. అయితే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సంఘం పెట్టుకునే హక్కు ఉంది. కానీ సంఘం పెట్టగానే సంతోషం కాదు కదా. అయితే రాజమౌళి ప్రోద్బలం వెనక ఎవరికీ తెలియని ఓ ప్రతీకార కోణం ఉండటం దాని కోసమే ఇలా దర్శకుల సంఘాన్ని చీల్చడం అనే విషయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం రాజమౌళి తెలుగు టెక్నీషియన్స్ ను కాదని వేరే భాషల వారికి అవకాశాలిచ్చాడు. ఇది సంఘం నిబంధనలకు విరుద్ధం. కాబట్టి ఆయన్ని కొన్నాళ్ల పాటు బ్యాన్ చేసింది ఫిల్మ్ ఫెడరేషన్. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తను టాప్ అని భావిస్తున్నాడు కాబట్టే తాజాగా తనే ఓ కొత్త సంఘాన్ని మొదలుపెట్టి అందులో తనతోటి వారినీ కలుపుకుని పరిశ్రమలో ఒకరమైన చీలికలు తెచ్చే ప్రయత్నం గ్రాండ్ గా చేస్తున్నాడు. ఈయనకు సామాజిక అంశాలతో సినిమాలు చేసే శ్రీమంతపు దర్శకుడూ వత్తాసు పలుకుతుండటం విశేషం. మొత్తంగా ఈ సంఘం పుట్టుక విషయం పక్కన బెడితే మనుగడ కోణంలో కొన్ని ప్రశ్నలున్నాయి. సమస్యలున్నాయి. వీటికి రాజమౌళి అండ్ టీమ్ సమాధానం చెబుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ప్రతీకారంతో మొదలయ్యే సంఘాల్లో నాయకత్వం లక్షణాలు కనిపించవు. ఒకవేళ ఉన్నా సవాళ్లు ఎదుర్కోవడం అంత సులభం కాదు.

మొత్తంగా ఇప్పుడు పరిశ్రమలో కనిపిస్తోన్న ‘కొన్ని’దర్శక సమస్యలు తీర్చే సత్తా ఈ సంఘంలో ఉందా..? కొన్నాళ్ల క్రితం ప్రస్తుతం మహేష్ బాబుతో సర్కారువారి పాట సినిమా చేస్తోన్న దర్శకుడు పరశురామ్ కు గతంలో రాజమౌళితో ఛత్రపతి సినిమా చేసిన నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ పాతికలక్షలు అడ్వాన్స్ గా ఇచ్చాడు. అయితే అతను సినిమా చేయలేదు. పైగా తనను కాదని ఆల్రెడీ ఓ సినిమా చేసి ఇప్పుడు మహేష్ బాబుతో వెళుతున్నాడు. దీంతో భోగవల్లి ప్రసాద్ తనకు సినిమా చేయనందుకు గానూ భారీ మొత్తంలో డబ్బులు తిరిగిమ్మని డిమాండ్ చేస్తున్నాడు. దీన్ని పరిష్కరించే సత్తా ఇప్పుడే పుట్టిన ఈ పిల్ల సంఘానికి ఉందా..? అలాగే మైత్రీ మూవీమేకర్స్ వారు బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చి.. బాలకృష్ణతో సినిమా చేయాలనుకున్నారు. కానీ బడ్జెట్ కారణంగా ఆపేసుకున్నాలరు. అయితే ఇప్పుడు బోయపాటిని అడ్వాన్స్ తిరిగిమ్మని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక అడ్వాన్స్ కు వడ్డీ కలిపి ఇవ్వమని అడుగుతున్నారు. మరి ఈ బ్యానర్ లో రాసుకుపూసుకు తిరిగే సదరు శ్రీమంతపు దర్శకుడు జోక్యం చేసుకుని న్యాయం చేయొచ్చు కదా.. ఆ దమ్ము మీకు ఉందా..? ఇక గోపీచంద్ మలినేని - సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో సినిమా మొదలైది. భగవాన్ - పుల్లారావు నిర్మించాలనుకున్న ఈ మూవీని హీరో మధ్యలే వదిలేశాడు. దీంతో నిర్మాతలు ఆ నష్టాన్ని దర్శకుడు భరించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ సమస్యను పరిష్కరించే సత్తా మీకు ఉందా దర్శకధీరులూ.. అని చాలామంది అడుగుతున్నారు. ఏదేమైనా నాయకుడు అంటే సమస్యలను పరిష్కరించడం ద్వారా సమస్యల వల్లనే పుడతాడు. సమస్యలు క్రియేట్ చేస్తూ ఉద్భవించేవాడు ఎప్పుడూ నాయకుడు కాలేడు. ఈ

విషయాన్ని గుర్తెరిగి.. మీరు నిజంగా జెన్యూన్ అయితే ముందుగాఈ సమస్యలు పరిష్కరించండి. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకునేలా చొరవ చూపండి. అంతే కానీ.. ఎంత సేపూ సంఘాలను విడగొడదాం.. సత్తా చాటదాం అంటే కుదరదు రాజమౌళి అండ్ టీమ్ గార్లూ..

Tags

Read MoreRead Less
Next Story