Top

జమ్మూ కాశ్మీర్‌లో మరో నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూ కాశ్మీర్‌లో మరో నలుగురు ఉగ్రవాదుల హతం
X

జమ్మూ కాశ్మీర్‌లోని షోమియన్ జిల్లాలో మరోసారి తుపాకీ మోత మోగింది. సోమవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పులలో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. గత 24 గంటల్లో షోపియన్ జిల్లాలో ఇది రెండవ ఎన్‌కౌంటర్.

దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్‌లోని పిన్జోరా ప్రాంతంలో భద్రతా దళాలు సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందుకున్న తరువాత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే ఈ క్రమంలో ముందుగా ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తరువాత ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. అంతకుముందు ఆదివారం, జిల్లాలోని రెబాన్ ప్రాంతంలో భద్రతా దళాలు సెల్ఫ్ స్టైల్ కమాండర్‌తో సహా ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను హతమార్చాయి.

Next Story

RELATED STORIES