మెగాస్టార్ చిరంజీవి మృతి అంటూ రచయిత్రి రాంగ్ పోస్ట్..

మెగాస్టార్ చిరంజీవి మృతి అంటూ రచయిత్రి రాంగ్ పోస్ట్..
X

ప్రముఖ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా మృతి చెందారు. 39 సంవత్సరాల చిరంజీవి సర్జ జూన్ 7న ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందాడు. దీంతో శాండిల్‌వుడ్ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన ఆకస్మిక మరణంపై పలువురు సెలబ్రెటీలు స్పందిస్తూ.. చిరంజీవి సర్జా మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

sarja

ఈ నేపథ్యంలో ప్రముఖ కాలమిస్ట్ మరియు నవలా రచయిత్రి శోభా డే ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్‌తో మెగస్టార్ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిరంజీవి సర్జా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేయడంలో భాగంగా పెద్ద పొరపాటు చేశారు శోభా డే. చిరంజీవి మృతిపై ట్విట్టర్‌లో శ్రద్దాంజలి ఘటిస్తూ.. 'మరో యువ నటుడు ఈ లోకం నుంచి వెళ్లిపోయారని, ఈ విషాద కరమైన వార్త షాక్ గురి చేసిందని అన్నారు. ఆయన మరణం పూడ్చలేనిదని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని' పోస్టు పెట్టారు.

shobha-de-1

ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ ట్వీట్‌లో చిరంజీవి సర్జా ఫోటోకు బదులుగా మెగాస్టార్ చిరంజీవి ఫోటో పెట్టారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇక ఈ ట్వీట్ చూసిన మెగస్టార్ అభిమానులు.. వెంటనే ఆమెపై ఓ రేంజ్‌లో కామెంట్స్ చేయటం మొదలు పెట్టారు. 'కనీసం ఎవరు చనిపోయారో తెలియకుండా ఎవరి ఫోటోను పెడితే వారి ఫోటోను పెట్టి ట్వీట్ చేస్తావా' అంటూ మెగస్టార్ అభిమానులు గరం అవుతున్నారు. దీంతో తన పొరపాటు గమనించిన ఆమె.. తప్పును సరిద్దిద్దుకొన్నారు. ఆ ట్వీట్‌ను వెంటనే డిలీట్ చేశారు. అయినా సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది.

shobha-de

2009లో వాయుపుత్ర మూవీతో వెండితెరపై అడుగు పెట్టారు చిరంజీవి సర్జ. తొలి మూవీతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు 25 సినిమాల్లో నటించాడు. ప్రముఖ కన్నడ హీరోయిన్ మేఘనా రాజ్‌ను 2018లో పెళ్లి చేసుకున్నాడు చిరంజీవి సర్జ.

sarja-and-meghana

Next Story

RELATED STORIES