49 మంది ఎన్డీఆర్‌ఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా

49 మంది ఎన్డీఆర్‌ఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా
X

ఒడిశాలో ఉంప‌న్ తుఫాను స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న 49 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి కరోనా సోకింది. వీరికి ఒడిశాలో కరోనావైరస్ పరీక్షలు చేసినట్టు అధికారులు తెలిపారు. వీరంతా కటక్‌లోని ముండలి ప్రాంతంలోని ఎన్‌డిఆర్‌ఎఫ్ 3వ బెటాలియన్‌కు చెందినవారుగా తెలుస్తోంది. అమ్ఫాన్ తుఫాను పునరుద్ధరణ పనుల కోసం బెంగాల్ వెళ్లి జూన్ 3న ఒడిశాకు తిరిగి వచ్చిన 173 మంది సభ్యుల దళంలో వీరు భాగమని ఎన్డిఆర్ఎఫ్ వర్గాలు తెలిపాయి.

173 మందికి ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌గా 49 మందికి క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్లు తేలింది. ప‌శ్చిమ‌బెంగాల్‌లో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా ఒడిశా ఫైర్ సర్వీసెస్‌కు చెందిన 376 మంది, ఒడిశా రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు చెందిన 271 మంది కూడా పాల్గొన్నారు.. వీరంద‌రి న‌మూనాలు ల్యాబ్‌కు పంపించారు.. అయితే వీరి ఫ‌లితాలు ఇంకా రావలసి ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

Next Story

RELATED STORIES