దేశంలో గత 24 గంటల్లో 9,987 పాజిటివ్ కేసులు

దేశంలో గత 24 గంటల్లో 9,987 పాజిటివ్ కేసులు
X

భారతదేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసులు గత 24 గంటల్లో 9,987 పెరిగి 2,66,598 కు చేరుకున్నాయి. కరోనావైరస్ మరణాల సంఖ్య 266 పెరిగి 7,466 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ లో ఉంది. మరోవైపు భారత్ లో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 1,29,917 గా ఉండగా, పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,29,214 గా ఉంది. కాగా 9,987 కొత్త కరోనావైరస్ కేసులతో, భారతదేశం మరోసారి అతిపెద్ద సింగిల్ డే స్పైక్‌ను నమోదు చేసినట్లయింది.

Next Story

RELATED STORIES