బీరును మంచినీళ్లలా గటగటా తాగేసిన చేప!

బీరును మంచినీళ్లలా గటగటా తాగేసిన చేప!

నిత్యం నీళ్ల‌లో ఉండే చేప‌లు ఏం తాగుతాయి‌? అని అడిగితే చెప్పటానికి చాల మంది తడపడతారు.. ఎందుకంటే ఉప్పు నీటిలో నివ‌సించే చేప‌లు నీళ్లు తాగుతాయి. అదే మంచి నీటిలో ఉండే చేప‌లు మాత్రం నీళ్లు తాగ‌వు. మరి చేప బీరు తాగితే ఎలా ఉంటుంది. చేప బీరు తాగటం ఏంటి విడ్డూరం కాకపోతేనూ అని అనుకుంటున్నారా? చదవడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం. మనుషులు తాగే బీర్‌ను ఓ చేప గుటగుటా తాగేసింది. బ్రెజిల్‌లోని సముద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బ్రెజిల్‌లోని సముద్రంలో ఓ వ్యక్తి షికారుకెళ్లాడు. ఈ నేపథ్యంలో ఓ చేప నీటిలోంచి పైకి వచ్చి అతని పడవ ఎక్కి కూర్చోంది. ఆ సమయంలో అతను చేతిలో బీర్‌ సీసా పట్టుకొని తాగుతున్నాడు. అయితే చేప బీర్‌ తాగుతుందో లేదో అని బాటిల్‌ను చేప ముందుంచాడు. ఇక అంతే వెంటనే ఆ చేప బీర్‌ని గుటగుటా తాగేసింది. చేప బీరు తాగుతున్న వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుశాంత నంద సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. 33 సెకండ్ల పాటు ఉండే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story