గొప్ప యాక్టర్ కావాలని కలలు కన్నాను.. హీరోలతో రొమాన్స్ చేయడాన్ని..

గొప్ప యాక్టర్ కావాలని కలలు కన్నాను.. హీరోలతో రొమాన్స్ చేయడాన్ని..
X

సూపర్ స్టార్ కృష్ణ గారి అమ్మాయంటే అభిమానులకు ఎంతో గౌరవం, మర్యాద. ఆమెను ఆమెగానే చూడాలనుకున్నారు. అంతే కానీ హీరోలతో రొమాన్స్ చేస్తామంటే తమ ఇంటి ఆడపడుచు అలా చేయడమేంటని తల్లడిల్లి పోయారు. హీరోయిన్ గా మంజులను ఏమాత్రం అంగీకరించలేకపోయారు. ఫలితంగా ఎన్నో కలలతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మంజుల ఇంటికే పరిమితమైంది. గొప్ప యాక్టర్ కావాలన్న ఆశ అడియాశగానే మిగిలిపోయింది.

అలా అని ఇండస్ట్రీ నుంచి పూర్తిగా వైదొలగలేదు. తమ్ముడు మహేష్ బాబు నటించిన బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ పోకిరి సినిమాకు ప్రొడ్యూసర్ గా పని చేశారు. నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఈ విషయాలన్నీ పొందుపరుస్తూ ఓ అయిదు నిమిషాల నిడివి గల వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తాను పదేళ్ల పాటు అనుభవించిన మానసిక వత్తిడిని గురించి వివరించారు. ఆరోగ్య సమస్యలను ఎలా అధిగమించారో తెలిపారు.

ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన మంజుల ఇది తన మొదటి వీడియో అని తెలిపారు. నేను నా జీవితంలో 30 సంవత్సరాలు వ్యక్తిగత అభివృద్ధికి, 20 సంవత్సరాలు ధ్యాన సాధనకు అంకితం చేశానన్నారు. 10వేల గంటల కంటే ఎక్కువగా యోగా ప్రాక్టీస్ చేశానని తెలిపారు. ఇక నుంచి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేస్తానని పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES