ఏంటీ.. కరెంట్ బిల్లు రూ.80 లక్షల కోట్లా..

ఏంటీ.. కరెంట్ బిల్లు రూ.80 లక్షల కోట్లా..
X

ఆ ఇంటి యజమానికి బిల్లు చూసి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. లాటరీ టికెట్ కొన్నా అంత డబ్బు రాదే. బిల్లేంది ఇంత వచ్చింది. ప్రపంచంలోని మొత్తం జనాభా బిల్లు నాకే వచ్చిందా ఏంటి అని ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు చూసి అవాక్కయ్యాడు మధ్యప్రదేశ్ కి చెందిన వినియోగదారుడు. ఓ సామాన్యుడికి వందల్లోనే కరెంట్ బిల్లు వస్తుంది. అలాంటిది వేలు, లక్షలు దాటి కోట్లు వచ్చిందంటే ఎలక్ట్రిసిటీ అధికారుల ఘనకార్యమే మరి. సింగ్రౌలి జిల్లాలో బైఢన్ గ్రామంలో నివసించే వినియోగ దారుడి బిల్లు ఏకంగా ఎనభై లక్షల కోట్లు వచ్చింది.

ఒకట్లు పదులు వందలు వేలు అంటూ లెక్క పెట్టడం కూడా రాని ఆ వినియోగదారుడు అన్ని సున్నాలు చూసి శూన్యంలోకి చూస్తుండి పోయాడు. వెంటనే తేరుకుని విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాబూ బిల్లు మళ్లొక సారి సరి చూసి పంపండి అంటే అధికారులు వినిపించుకోవట్లేదని వాపోతున్నాడు. ప్రస్తుతం ఈ బిల్లుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యుత్ శాఖ అధికారులకు ఇదేం కొత్తకాదు. ఇది వరకు ఇలాంటివి చాలా వచ్చాయని కూల్ గా ఉండిపోయారు.

Next Story

RELATED STORIES