కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన బీజేపీ నేత డిశ్చార్జ్

కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన బీజేపీ నేత డిశ్చార్జ్
X

కోవిడ్ -19 లక్షణాలు ఉండడంతో బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పత్రా గుర్గావ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.. ఆయన గుర్గావ్‌లోని మెదంత ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అయితే చికిత్స అనంతరం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు సంబిత్ పత్రా.. ఈ విషయాన్నీ తనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మెదంత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన ఒక రోజు తరువాత, సంబిత్ పత్రా మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు, అందులో ఇలా పేర్కొన్నారు..

“మీ అందరి శుభాకాంక్షలకు నేను ఇంటికి తిరిగి వచ్చాను. అయితే, పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని సంబిత్ పత్రా మంగళవారం తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ప్రతినిధి సంబిత్ పత్రా పలు న్యూస్ ఛానెళ్లలో బీజేపీ తరుఫున చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు.. అంతేకాదు బీజేపీ తరుఫున ఎక్కువగా కనిపిస్తుంటారు. ఆయనకు కరోనావైరస్ లక్షణాలు అనిపించడంతో రెండు వారాల క్రితం సంబిత్ పత్రాను గుర్గావ్‌లోని మెదంత ఆసుపత్రిలో చేర్చారు.

దాంతో జ్యోతిరాదిత్య సింధియాతో సహా పలువురు బిజెపి నాయకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Next Story

RELATED STORIES