జూన్ 10న మహారాష్ట్రలోకి నైరుతి! ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు..

జూన్ 10న మహారాష్ట్రలోకి నైరుతి! ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు..
X

నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో చురుకుగా కొనసాగుతున్నాయి. IMD విడుదల చేసిన సవరించిన రుతుపవనాల ప్రారంభ తేదీల ప్రకారం, జూన్ 10 నుండి మహారాష్ట్రలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని పేర్కొంది. జూన్ 10-12 మధ్యకాలంలో ముంబై, థానే, పాల్ఘర్లలో మెరుపులు, ఈదురు గాలులు 30-40 కిలోమీటర్ల వేగంతో రుతుపవనాలు చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉందని..

దీని ప్రభావంతో మంగళవారం, ముంబై నగరం మరియు శివారు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే నైరుతి రుతుపవనాలు రాగల 48 గంటల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమ, మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. అలాగే రానున్న 76 గంటల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు, కోస్తాలోని ఇతర ప్రాంతాలకు, సిక్కిం, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ మొదలైన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా లోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Next Story

RELATED STORIES