తాజా వార్తలు

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కష్టపడి చదివిన విద్యార్థుల్లో టెన్షన్

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..  కష్టపడి చదివిన విద్యార్థుల్లో టెన్షన్
X

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు పాసైపోయారు. పరీక్షలు రాయకుండానే ఎగ్జామ్స్ గండం గట్టెక్కేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు. పదో తరగతి చదివిన వారంతా తదుపరి తరగతి కి ప్రమోట్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. పదో తరగతి చదివి, పరీక్షకు సిద్దమైన వారందరిని ప్రమోట్ చేసింది. ఇంటర్నల్, అసెస్‌మెంట్ మార్క్‌ల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ నిర్ణయిస్తారు. కరోనా విజృంభిస్తుండడంతో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్ రావులతో ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, పరీక్షల నిర్వహణకు సాధ్యాసాధ్యాలు, తల్లిదండ్రుల విజ్ఞప్తులపై సుదీర్ఘంగా చర్చించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పదో తరగతి పరీక్షల విషయంలో తీసుకున్న నిర్ణయాలపైనా సమాలోచనలు జరిపారు. సుదీర్ఘ డిస్కషన్ తర్వాత పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించారు. ఇంటర్నల్, అసెస్‌మెంట్ మార్క్‌ల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వాలని తీర్మానించారు. ఈ మేరకు విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ కూడా ఇంటర్నల్ మార్క్‌ల జాబితాను సిద్దంగా పెట్టుకోవాలంటూ స్కూళ్లకు ఆదేశాలు పంపించింది.

తెలంగాణాలో 5 లక్షల 34 వేల 903 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. టెన్త్‌లో 6 సబ్జెక్టులు, 11 పేపర్లు ఉన్నాయి. ఏప్రిల్‌లో 2 సబ్జెక్టులకు సంబంధించి 3 పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయం లో కరోనా వ్యాప్తి పెరగడంతో పరీక్షలు వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన హైకోర్ట్, పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో కొన్ని రోజుల పాటు ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఏప్రిల్, మే నెలల్లో కరోనా తగ్గకపోవడం, లాక్‌డౌన్‌ను పూర్తిగా తొలగించకపోవడంతో మిగిలిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై సందిగ్దత ఏర్పడింది. అసలు పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే చర్చ జరిగింది. ఓ దశలో ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపింది. అందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. కానీ, హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ప్రతి విద్యా ర్థిని టెస్ట్ చేయడం సాధ్యమవుతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. కరోనా ఇంతగా వ్యాపిస్తున్న సమయంలో పరీక్షలు పెట్టడం మంచిది కాదని పేరెం ట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

పదో తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులను ప్రమోట్ చేయడం ఇదే తొలిసారి. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాత్రం అసంతృప్తితో ఉన్నారు. చదవని విద్యార్థులు సంబరపడుతుంటే, కష్టపడి-బాగా చదివిన విద్యార్థులకు గ్రేడ్‌లు తక్కువగా వస్తాయేమో అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు.

Next Story

RELATED STORIES