వారిపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించండి : సుప్రీంకోర్టు

వారిపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించండి : సుప్రీంకోర్టు
X

2005 నాటి విపత్తు నిర్వహణ చట్టం కింద వలస కార్మికులపై బుక్ చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వలస కార్మికులపై ఈ చట్టం కింద అనేక కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక వలస వచ్చినవారికి స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు వీలుగా 24 గంటల్లో ష్రామిక్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చెయ్యాలని సుప్రీం కోర్టు సూచించింది. అలాగే వలస వచ్చిన వారందరి రవాణా 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది.

ఇలా వారి స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలసదారులకు ఉపాధి కోసం పథకాలు, ప్రయోజనాలు కూడా కల్పించాలని కేంద్రం, రాష్ట్రాలు, యుటిలను కోర్టు ఆదేశించింది. అలాగే ఈ పథకాల వివరాలు గ్రామంలో, వార్డు స్థాయిలలో త్వరగా ప్రచారం చేయాలనీ.. ఇందుకు సంబంధించి వలస దారులకు కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చెయ్యాలని సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాలకు సూచించింది.

Next Story

RELATED STORIES