75 ఏళ్ల ఐరాస చరిత్రలో ఇదే తొలిసారి.. ఇలా..

కరోనా మహమ్మారి చరిత్ర పుటల్నే మార్చేస్తోంది. గత 75 ఏళ్ల కాలంలో దేశాధినేతలు లేకుండా ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరగలేదు. ఐరాస వార్షిక సమావేశాలు సెప్టెంబర్ చివరి వారంలో న్యూయార్క్ లో జరుగుతాయి ప్రతి ఏటా. అయితే ఈ ఏడాది ఈ సమావేశాలను నిర్వహించడం లేదని యూఎస్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు టిజ్జని ముహమ్మద్ బండే ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. 193 దేశాధినేతలు హాజరయ్యే ఈ సమావేశాలకు దేశాధినేతలతో పాటు ప్రతినిధి బృందాలు కూడా వస్తాయి. మహమ్మారి సమయంలో వారందరినీ న్యూయార్క్ కి రప్పించడం అసాధ్యం అని ఆయన అన్నారు.
ఐరాస 75వ వార్షికోత్సవాన్ని మహమ్మారి కారణంగా విరమించుకోవాలని సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ గత నెలలో సిఫారసు చేశారు. అయితే సమావేశాలకు హాజరయ్యే బదులుగా దేశాధి నేతలు మరియు ప్రభుత్వ పెద్దలు ముందుగా రికార్డ్ చేసిన సందేశాలను సమితికి అందించాలని ముహమ్మద్ బండే సూచించారు. సెప్టెంబర్ చివరి నాటికి వంద లేదా అంతకంటే ఎక్కువ ప్రజలను ఐరాస వేదిక మీదకు అనుమతించవచ్చు. నిజానికి ప్రపంచ నాయకుల సమావేశం సాధారణంగా వేలాది మంది ప్రభుత్వ అధికారులు, దౌత్య వేత్తలు, పౌర సమాజ ప్రతినిధులతో వారానికి పైగా జరుగుతుంది. వాటన్నింటికీ కరోనా మహమ్మారి చెక్ పెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com