'ఎలా మాట్లాడాలో నేర్చుకో'.. పవర్‌ఫుల్‌ డైలాగ్ చెప్పిన బాలయ్య బాబు

ఎలా మాట్లాడాలో నేర్చుకో.. పవర్‌ఫుల్‌ డైలాగ్ చెప్పిన బాలయ్య బాబు
X

బాలయ్య బాబు అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. దాన్ని మరోసారి నిరూపిస్తూ పక్కా మాస్ మూవీతో వస్తున్నాడు నందమూరి నటసింహం. బాలయ్య బాబు..60వ ఏట అడుగుపెట్టనున్న సందర్భంగా.. బోయపాటి శ్రీనుతో చేస్తోన్న మూడో చిత్రానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ ప్రోమోలో 'ఎదుటివారితో మాట్లాడేటపుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శ్రీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అని అడిగేదానికి .. శ్రీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందిరా'.. అంటూ బాలయ్య బాబు పవర్‌ఫుల్‌గా చెప్పిన డైలాగులు కేక పుట్టిస్తున్నాయి. బాలయ్యను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా చూపించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. బాలయ్య నుంచి ఫ్యాన్స్ ఎలాంటి డైలాగులు.. ఎమోషన్స్ ఆశిస్తారో.. సరిగ్గా అటువంటి కంటెంట్‌తో బోయపాటి శ్రీను వస్తున్నాడు. ముఖ్యంగా తెల్ల పంచె, ఖద్దరు చొక్కా, కోర మీసం లుక్‌లో బాలయ్య బాబు గెటప్ అదిరిపోయింది. మొత్తంగా BB3 అనే వర్కింగ్ టైటిల్‌తో బాలయ్య బాబు అభిమానులకు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు దర్శక, నిర్మాతలు.

ఇప్పటికే తన పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం జగదేకవీరుని కథలోని అమర గాయకుడు ఘంటసాల ఆలపించిన ‘శివ శంకరీ శివానంద లహరి’ పాటను పాడి అభిమానులను అలరించారు బాలయ్య.

Next Story

RELATED STORIES