దేశంలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. ప్రముఖులు కూడా..

దేశంలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. ప్రముఖులు కూడా..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రముఖులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. బీజేపీ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియాకు కరోనా సోకింది. ఆయన తల్లికి కూడా వైరస్ అంటుకుంది. వీరిద్దరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్లు బయటపడింది. దాంతో వారిద్దరిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వారిద్దరినీ ఇటీవల కలసిన వ్యక్తులను గుర్తించి వారికి కూడా పరీక్షలు చేస్తున్నా రు. ఇటీవలే బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రాకు కరోనా వచ్చింది. అతన్ని రెండు వారాల పాటు క్వారంటైన్ చేశారు. వైరస్ ముప్పు తొలగిపోవడంతో డిశ్చార్జ్ చేశారు. ఐతే, తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని సంబిత్ పాత్రా పేర్కొన్నారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. టెస్ట్ ఫలితాలు రేపు రానున్నాయి. కేజ్రీవాల్‌ మూడు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. దాంతో కరోనా సోకిందనే అనుమానాలు రావడంతో ఆయన్ను వెంటనే హోం క్వారంటైన్ చేశారు. వైరస్ సోకిందో లేదో నిర్దారణ చేసుకోవడానికి పరీక్షలు చేశారు. కేజ్రీవాల్‌కు ఇప్పటికే ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలున్నాయి. మధుమేహం, ఆస్తమాతో బాధపడుతున్నారు. అప్పుడప్పుడూ ప్రకృతి వైద్యం కూడా చేయించుకుంటారు.

ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే 30 వేల కేసులతో దేశంలో మూడో స్థానంలో ఉంది. కరోనా బారిన పడి 750 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అక్కడ కేసుల డబ్లింగ్ రేటు 12 నుంచి 13 రోజులుగా ఉంది. తాజాగా, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలై 31 నాటికి ఢిల్లీలోనే ఐదున్నర లక్షల కేసులు నమోదవుతాయని సిసోడియా పేర్కొన్నారు. జులై 31 నాటికి ఢిల్లీకే 80 వేల బెడ్లు అవసరమవుతాయని అంచనా వేశారు. దేశ రాజధానిలో కరోనా సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని ప్రచారం జరుగుతోంది. దాంతో, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ బైజాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలో కరోనా వ్యాప్తి, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఢిల్లీలో నానాటికి కేసులు పెరుగుతుండడంపై ప్రభుత్వం ఆందో ళన చెందుతోంది. లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ కేసులు వస్తుండడంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పరిస్థితి ఘోరంగా ఉంది. వైరస్ కేసుల విషయంలో బాంబే, వూహాన్‌తో పోటీ పడుతోంది. వైరస్ పుట్టిన వూహాన్‌లో ఎన్ని కేసులు నమోదయ్యాయో బాంబేలోనూ అన్నే కే సులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 90 వేల కేసులుండగా అందులో ఒక్క ముంబైలోనే 51 వేల మందికి పైగా బాధితులున్నారు. మహారాష్ట్ర మొత్తమ్మీద 3200 మందికి పైగా చనిపోతే ఒక్క బాంబే లోనే 17 వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జోరుగా సాగుతోందనే ఆరోపణలున్నాయి. పరిస్థితి అదుపుతప్పే దశ వచ్చిందని ప్రచారం జరుగుతోం ది.

విపత్తు సహాయక బృందాలకు కూడా కరోనా అంటుకుంది. 49 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల బెంగాల్, ఒడిశాల్లో ఆంఫన్ తుపాన్ బీభత్సం సృష్టించింది. తుపాన్ సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. అందులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దాంతో మిగతావారికి పరీక్షలు చేయగా 49 మందికి కరోనా సోకినట్లు నిర్దారించారు. వారిని ఎన్డీఆర్ఎఫ్ శిబిరంలోని క్వారంటైన్‌లో ఉంచారు. ఒడిశా ఫైర్ సర్వీసెస్‌కు చెందిన 376 మంది, ఒడిశా రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు చెందిన 271 మందికి కూడా కరోనా టెస్టులు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story