ఢిల్లీలో కరోనా విజృంభణ.. కొత్తగా 1,366 కేసులు..

ఢిల్లీలో కరోనా విజృంభణ.. కొత్తగా 1,366 కేసులు..
X

ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 1,366 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, దీంతో దేశ రాజధానిలో 31,309 కు చేరుకోగా, మరణాల సంఖ్య 905 కు చేరుకుంది. ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం, మొత్తం 18,543 క్రియాశీల కేసులు ఉండగా, 11,861 మంది రోగులు కోలుకున్నారు.

జూలై చివరి నాటికి ఢిల్లీలో COVID-19 కేసుల సంఖ్య 5.5 లక్షలకు పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అంచనా వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని తేలింది. కాగా భారతదేశంలో కరోనావైరస్ కేసులు కొత్తగా 9,985 నమోదయ్యాయి.

Next Story

RELATED STORIES