కరోనా కాటుకు బలైన ఎమ్మెల్యే..

కరోనా కాటుకు బలైన ఎమ్మెల్యే..
X

తమిళనాడులోని డీఎంకే పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అన్బాజగన్ కరోనా భారిన పడి బుధవారం మృతిచెందారు. ఆయన మృతి చెందారన్న విషయాన్నీ స్వయంగా ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి బుధవారం ఉదయం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. అన్బాజగన్ తిరువల్లికేని నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు, గతంలో డిఎంకె మాజీ అధ్యక్షుడు ఎం. కరుణానిధి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు.

కాగా చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే జె. అన్బాజగన్ కు కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షలు చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన కొద్ది రోజులకే మరణించారు. దీంతో డీఎంకే నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ ఒక ప్రకటనలో ఈ వార్తను ధృవీకరించారు.. ఎమ్మెల్యే మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఎమ్మెల్యే అన్బాజగన్ తీవ్రమైన కోవిడ్ -19 న్యుమోనియాతో ప్రాణాలతో పోరాడుతున్నారని, బుధవారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి మరింతగా క్షీణించి అనారోగ్యానికి గురయ్యారని రెలా ఇన్స్టిట్యూట్ , మెడికల్ సెంటర్ అధికారిక బులెటిన్ తెలిపింది. అన్బాజగన్ ఉదయం 8.05 గంటలకు మరణించినట్లు ప్రకటించారు ఆసుపత్రి సిబ్బంది తెలిపింది.

Next Story

RELATED STORIES