ఫుడ్‌ డెలివరీకి సరికొత్త ప్రయోగం ఏంటో తెలుసా..?

ఫుడ్‌ డెలివరీకి సరికొత్త ప్రయోగం ఏంటో తెలుసా..?

డ్రోన్‌లతో డోర్ డెలివరీ.. ఇప్పటివరకూ సినిమాల్లోనూ, యాడ్స్‌లోనూ మనకు కనిపించాయి. ఇక నుంచి డ్రోన్స్ మన ఇంటి ముందే వాలబోతున్నాయి. మన దేశంలో ప్రస్తుతం షూటింగ్ కోసం కెమెరాలను అమర్చి డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే.. ఇంటింటికీ డ్రోన్‌లు వచ్చే కాలం త్వరలోనే రానుంది. అవి కూడా మనం ఆర్డర్ చేసిన ఫుడ్ పార్సెల్స్ మోసుకుని.. మన ఇంటి తలుపు తట్టనున్నాయి.

కరోనావైరస్ అన్ని దేశాలపై దాడి చేసిన తరువాత.. ప్రతిరంగంలోనూ కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ విషయంలో జనాలలో భయం ఇంకా పోలేదు. అందుకే హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్‌లో పర్మిషన్ ఇచ్చినా.. సేల్స్ మాత్రం ఇంకా ఊపందుకోలేదు. ఒకవైపు డెలివరీ ఖర్చులు తగ్గించుకోవడం.. మరోవైపు నాన్-కాంటాక్ట్ డెలివరీపై కస్టమర్లకు భరోసా ఇచ్చేందుకు కంపెనీలు ఇప్పుడు డ్రోన్‌లను రంగంలోకి దించుతున్నాయి.

మన దేశంలో డ్రోన్‌లను ఉపయోగించి ఫుడ్ డెలివరీ చేసే సదుపాయం త్వరలోనే రానున్నాయి. ఇందుకోసం... పలు కంపెనీలకు డ్రోన్ టెస్టింగ్ చేసేందుకు డీజీసీఏ అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే 13 కంపెనీలు ఇలా అనుమతులను పొందాయి. జొమాటో, స్విగ్గీ, డుంజోలతో పాటు.. ఎయిర్‌లైన్ సంస్థ స్పైస్‌జెట్, రిలయన్స్ అండదండలతో నడుస్తున్న స్టార్టప్ ఆస్టీరియా ఏరోస్పేస్‌లతో సహా మొత్తం 13 కంపెనీలకు.. ఆకాశంలో డ్రోన్‌ల టెస్టింగ్‌పై వైమానిక శాఖ నుంచి పర్మిషన్స్ సాధించాయి. జొమాటో సంస్థ అయితే ఇప్పటికే ఇండియాలో.. ఒక దఫా టెస్టింగ్‌ను కూడా పూర్తి చేసేసింది.

ఇప్పటివరకూ డ్రోన్స్ అంటే.. కొద్ది దూరం ప్రయాణం చేస్తున్నవి మాత్రమే. కానీ లాంగ్-రేంజ్ డ్రోన్‌లను ఎగరనివ్వడంపై.. ఎక్స్‌పెరిమెంటల్ టెస్టింగ్‌కు గతేడాది అనుమతులు వచ్చాయి. స్థానికంగా డ్రోన్ ఆధారిత సర్వీసులు అందించడంపై.. దీనిని తొలి అడుగుగా చెప్పారు. ఏదైనా నిర్ణీత ఎయిర్‌స్పేస్‌లో 100 గంటల ఫ్లైట్ టైమ్‌ను డ్రోన్స్ ద్వారా సెప్టెంబర్ 30లోగా టెస్ట్ చేసి... ఆ రిపోర్ట్‌లను డీజీసీఏకు అందించాల్సి ఉంది. స్పైస్ జెట్ కు చెందిన కార్గో డెలివరీ విభాగం స్పైస్‌ఎక్స్‌ప్రెస్.. ఈ డ్రోన్ టెస్టింగ్ చేపడుతోంది. ఎమర్జెన్సీ పార్సెల్స్, ఎస్సెన్షియల్ సప్లైస్‌ను డ్రోన్స్ ద్వారా డెలివరీ చేస్తామని అంటోంది.

ఇక జొమాటో టెస్టింగ్ డ్రోన్ అయితే.. మరింత ఆధునికం అనాల్సిందే. 5 కిలోల పేలోడ్‌ను.. 5 కిలో మీటర్ల పరిధిలో.. 10 నిమిషాల పాటు డ్రోన్ క్యారీ చేసిందని.. జొమాటో సంస్థ తెలిపింది. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈ డ్రోన్ ప్రయాణించడం ప్రత్యేకంగా చెప్పాలి. డ్రోన్ టెస్టింగ్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిన తరువాత... ఫుడ్ ఆర్డర్ చేసిన 15 నిమిషాలలోనే డెలివరీ చేయడం సాధ్యపడుతుందని ఈ ఫుడ్ డెలివరీ యాప్ అంటోంది. డ్రోన్స్ ద్వారా ఫుడ్ డెలివరీ ప్రారంభం అయితే... ఇండస్ట్రీలో ఇది గేమ్ ఛేంజర్ కానుంది.

Tags

Read MoreRead Less
Next Story