కేంద్ర రవాణా శాఖ కీలక నిర్ణయం.. ఆ గడువు సెప్టెంబర్ 30 వరకు..

కేంద్ర రవాణా శాఖ కీలక నిర్ణయం.. ఆ గడువు సెప్టెంబర్ 30 వరకు..

దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రిబ్రవరికి ముందు గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ , ఫిట్నెస్ పత్రాలను 2020 సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అయ్యేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్నీ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ ద్వారా తెలిపారు.

రెన్యూవల్ చేసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా లేనందున, పైగా రవాణాదారులు , పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అంతకుముందు, మార్చి 30న, కరోనా సంక్షోభం కారణంగా, రవాణా మంత్రిత్వ శాఖ ఫిట్నెస్ సర్టిఫికేట్, పర్మిట్లు, డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహనాల రిజిస్ట్రేషన్ గడువును జూన్ 30 వరకు పొడిగించగా.. తాజాగా దీనిని సెప్టెంబర్ 30 వరకు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story