మంచు లక్ష్మి మంచి మాట చెప్పింది.. ఇక నుంచైనా..

కరోనా మహమ్మారి కారణంగా వలస కూలీల వెతల్ని కళ్లారా చూశాము. లాక్డౌన్ లో పని లేక చేతిలో డబ్బులు లేక పస్తులు పడుకున్న వాళ్లనీ చూశాం. ఆయా పరిస్థితులపై స్పందించిన నటి మంచు లక్ష్మి మీడియాతో మాట్లాడారు. నెల జీతం పై ఆధారపడే వారి బ్రతుకులు దుర్భరంగా మారాయని అన్నారు. ఇలాంటి వారి ఆకలి తీర్చడం అన్నిటి కంటే ముఖ్యం అని అన్నారు. కొందరు తమ హోదా, దర్పం చూపించుకోవడానికి అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు.. అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు.
ఆ డబ్బేదో మంచి పనుల కోసం ఉపయోగిస్తే బావుంటుంది. ఇకనైనా ప్రజలు అనవసరంగా ఖర్చుచేయకుండా మంచి పనుల కోసం ఉపయోగిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. లాక్డౌన్ కాలంలో ఖాళీ కూర్చోవడం ఎందుకని కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టి లాక అప్ విత్ మంచు లక్ష్మి షో ద్వారా లైవ్ షోలు నిర్వహించింది. ఈ షో ద్వారా ప్రజల్లో వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఇంకా ఆమె తన ఎన్జీవో ద్వారా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com