కరోనా వేళ ఐసీసీ కొత్త నిబంధనలు.. బాల్ కి ఉమ్మి పూశారో..

కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే పాత నిబంధనలకు పాతరేయాల్సింది.. తాత్కాలిక నిబంధనలు ప్రవేశ పెడుతూ కొత్త నిబంధనలకు ఐసీసీ ఆమోద ముద్ర వేసింది. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ ఐదు సూచనలు చేసింది.
బాల్ పై ఉమ్మి పూయకూడదు.. అంపైర్ రెండు సార్లు చెప్పి చూస్తాడు.. అయినా అదే పని చేస్తే 5 పరుగుల జరిమానా విధిస్తాడు. ఈ రన్స్ ప్రత్యర్థి జట్టు ఖాతాలో వేస్తాడు.
టెస్ట్ మ్యాచుల్లో ఏ ఆటగాడికైనా కొవిడ్ లక్షణాలుంటే అతడి స్థానంలో వేరొకరిని తీసుకోవచ్చు. అయితే ఇది వన్డేలకు, టీ 20 లకు వర్తించదు.
స్థానిక అంపైర్లే మ్యాచ్ లను పర్యవేక్షిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలు నెలకొన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇద్దరు స్థానిక అంపైర్లు ప్రాతినిధ్యం వహిస్తారు.
ఆటగాళ్ల క్రమశిక్షణ కోడ్ కు సంబంధించి స్థానిక మ్యాచ్ రెఫరీకి ఐసీసీ క్రికెట్ ఆపరేషన్స్ టీమ్ సహకరించనుంది.
ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న క్రికెట్ బోర్డులకు వెసులు బాటు కల్పించేందుకు వీలుగా టెస్టు మ్యాచ్ లలో ఆటగాళ్ల జెర్సీలపై 32 చదరపు అంగుళాల మేర వాణిజ్యపరమైన లోగోకు అనుమతి లభించింది. ఇప్పటి వరకు వన్డేలకు, టీ 20 లకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉండేది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com