విషమంగా ఉన్న రోగుల సంఖ్యలో భారత్‌ రెండో స్థానం

విషమంగా ఉన్న రోగుల సంఖ్యలో భారత్‌ రెండో స్థానం

దేశంలో కరోనా కేసులు 2 లక్షల 75 వేలకు చేరాయి. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి దాదాపు 7 వేల 7 వందల మందికి పైగా మృతి చెందారు. ఢిల్లీ, ముంబైలలో పరిస్థితి ఘోరంగా ఉంది. వైరస్ కేసుల విషయంలో బాంబే, వూహాన్‌తో పోటీ పడుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లో కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది.

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండగా.. మరో ఆందోళనకర అంశం బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ సోకి ఆరోగ్యం విషమంగా ఉన్న రోగుల సంఖ్యలో భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు వరల్డో మీటర్‌ ప్రకటించింది. కొవిడ్‌ బారినపడినవారిలో అత్యధికంగా అమెరికాలో 16వేల 907 మంది క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా.. భారత్‌లో వారి సంఖ్య 8,944 అని పేర్కొంది. మన కంటే బ్రెజిల్‌లో కేసులు మూడు రెట్లు అధికంగా ఉన్నప్పటికీ అక్కడ విషమ స్థితిలో ఉన్నవారు 8,318 మాత్రమే. రష్యాలో సీరియస్‌ కేసుల సంఖ్య భారత్‌లో నాలుగో వంతు కావడం గమనా ర్హం. కాగా, దేశంలో మంగళవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,987 కేసులు నమోదయ్యాయని, 266 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కరోనా కేసుల్లో మృతుల సంఖ్య 5 శాతం కంటే తక్కువేనని కేంద్రం తెలిపింది. రోగుల్లో 2.25 శాతం ఐసీయూలో ఉన్నారని పేర్కొంది. దేశంలో వరుసగా ఆరో రోజు 9 వేల పైగా నమోదయ్యాయి. హరియాణ, జమ్ముకశ్మీర్‌, అసోం, కర్ణాటక, చత్తీ్‌సగఢ్‌, త్రిపుర రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమబెంగాల్‌లో ఆంఫన్‌ సహాయ చర్యల్లో పాల్గొన్న ఎన్టీఆర్‌ఎఫ్‌కు చెందిన 76 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు.

ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే 30 వేల కేసులతో దేశంలో మూడో స్థానంలో ఉంది. కరోనా బారిన పడి 750 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అక్కడ కేసుల డబ్లింగ్ రేటు 12 నుంచి 13 రోజులుగా ఉంది. దేశ రాజధానిలో కరోనా సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని ప్రచారం జరుగుతోంది. దాంతో, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ బైజాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలో కరోనా వ్యాప్తి, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఢిల్లీలో నానాటికి కేసులు పెరుగుతుండడంపై ప్రభుత్వం ఆందో ళన చెందుతోంది. లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ కేసులు వస్తుండడంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పరిస్థితి ఘోరంగా ఉంది. వైరస్ కేసుల విషయంలో బాంబే, వూహాన్‌తో పోటీ పడుతోంది. వైరస్ పుట్టిన వూహాన్‌లో ఎన్ని కేసులు నమోదయ్యాయో బాంబేలోనూ అన్నే కే సులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 90 వేల కేసులుండగా అందులో ఒక్క ముంబైలోనే 51 వేల మందికి పైగా బాధితులున్నారు. మహారాష్ట్ర మొత్తమ్మీద 3200 మందికి పైగా చనిపోతే ఒక్క బాంబే లోనే 17 వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జోరుగా సాగుతోందనే ఆరోపణలున్నాయి. పరిస్థితి అదుపుతప్పే దశ వచ్చిందని ప్రచారం జరుగుతోం ది.

బాలాసోర్‌ డీఆర్‌డీవో యూనిట్‌లో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. వీరితోపాటు ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ బృందంలోని 8 మంది జవాన్లకూ కరోనా సోకింది. కట్టడి చర్యలపై హర్షవర్ధన్‌ నేతృత్వంలోని మంత్రుల బృందం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించింది. ప్రభుత్వ కార్యాలయాలు తెరిచిన నేపథ్యంలో ’సామాజిక టీకా’ వంటి జాగ్రత్త చర్యలను కొనసాగించాలని హర్షవర్ధన్‌ సూచించారు. బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింథియా, ఆయన తల్లి మాధవి రాజె సింథియాలకు కరోనా నిర్ధారణ అయింది.

తమిళనాడులో కొత్తగా 1,685 మంది వైరస్‌ బారినపడ్డారు. చెన్నై లోనే 1,243 కేసులు నమోదయ్యాయి. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సీఎం పళనిస్వామి ప్రకటించారు. పుదుచ్చేరిలోనూ పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు. కర్ణాటకలో మరో 161 కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story