సైబర్ నేరాలు.. కోట్లు కొల్లగొడుతున్న రాజస్థాన్ ముఠాలు

సైబర్ నేరాలు.. కోట్లు కొల్లగొడుతున్న రాజస్థాన్ ముఠాలు

ఆన్ లైన్లో ఆఫర్లు చూసి వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. అదే సైబర్ నేరగాళ్ల పాలిట వరమైంది. రాజస్థాన్ ముఠా ఒకటి మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి నగరాల్లో ప్రజలను మోసం చేసి నెలకు రూ.15 కోట్లు కొల్లగొడుతున్నారని హైదరాబాద్ నగర పోలీసులు వివరిస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వీరు భారీగా సిమ్ కార్డులు సమకూర్చుకుని వందల మందికి ఫోన్లు చేస్తున్నారని, వాటికి స్పందించవద్దని సూచించారు. నిందితులు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో తెలుసుకునేందుకు గూగుల్ ప్లేస్టోర్ లో యాప్ లు ఉన్నాయని వాటిని ఉపయోగించుకుంటే మోసాలు తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

రాజస్థాన్ లోని భరత్ పూర్ ప్రాంతంలో ఉంటున్న సైబర్ నేరస్థులు కొన్ని నెలల నుంచి ఈ నేరాలకు పాల్పడుతున్నారు. అసోం, పశ్చిమ బంగ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో వందల సంఖ్యలో సిమ్ కార్డులు కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో సిమ్ కార్డుల విక్రయాలు తక్కువగా ఉండడంతో కొందరు ఏజెంట్లు అమ్మకాలు పెంచుకునేందుకు సైబర్ నేరస్థులకు సిమ్ కార్డులను విక్రయిస్తున్నారు. వీటి ద్వారా బాధితులతో మాట్లాడి లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయించుకుంటున్నారు. గతంలో కూడా ఈ తరహా నేరాలు మధ్యప్రదేశ్ లో వెలుగు చూడడంతో పదివేల సిమ్ కార్డులు బ్లాక్ చేయించామని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story