coronavirus : పాక్ లో మొదటిసారి రికార్డు స్థాయిలో మరణాలు

coronavirus : పాక్ లో మొదటిసారి రికార్డు స్థాయిలో మరణాలు

పాకిస్థాన్ లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో మరో 4 వేల మందికి పైగా కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం రోగుల సంఖ్య 108,317 కు చేరుకుంది. అలాగే కొత్తగా వైరస్ భారిన పడిన 105 మంది మరణించారు. దాంతో దేశంలో మొత్తం మరణాలు 2,172 కు చేరుకుందని.. పాకిస్థాన్ జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే దేశంలో 108,000 మందికి ఘోరమైన కరోనావైరస్ సోకినట్టు నివేదించింది.

కరోనా కారణంగా పాకిస్తాన్ తొలిసారిగా ఒకే రోజు 100 మందికి పైగా మరణించినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. కరోనావైరస్ నుండి ఇప్పటివరకూ 35,018 మంది రోగులు పూర్తిగా కోలుకున్నారని కూడా పేర్కొంది. ఇక పంజాబ్‌ ప్రావిన్స్ లో 40,819, సింధ్ 39,555, ఖైబర్-పఖ్తున్ఖ్వా 14,006, బలూచిస్తాన్ 6,788, ఇస్లామాబాద్ 5,785, గిల్గిట్-బాల్టిస్తాన్ 952, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ 412 కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story