అసభ్యకర పోస్టులు పెట్టిన అభిమానికి నటి..

అసభ్యకర పోస్టులు పెట్టిన అభిమానికి నటి..
X

నటీనటులు కూడా మనుషులే.. వారికీ స్పందించే హృదయం ఉంటుందని ఎందుకు అనుకోరు అభిమానులు.. ఏవో పిచ్చి రాతలు రాసి పోస్ట్ చేస్తుంటారు. అది మమ్మల్ని ఎంత బాధపెడుతుందో ఒక్కసారి కూడా ఆలోచించరా అంటూ మళయాళీ నటి అపర్ణా నాయర్ తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ఆమె పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ కు అజిత్ కుమార్ అనే వ్యక్తి ' ఐ లవ్యూ...............' అని అసభ్యకర కామెంట్ పెట్టాడు.

అది చూసిన అపర్ణకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆమె ఆ నెటిజన్ కు సంబంధించిన ఫేస్ బుక్ ప్రొఫైల్ ను ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తూ.. నేను కూడా ఒకరికి కూతుర్నే.. గుర్తుపెట్టుకోండి అని సమాధానమిచ్చారు. సోషల్ మీడియాను ఓ మంచి పనికి వాడండి. ఇలాంటి చెత్త కామెంట్స్ ను ప్రోత్సహించడానికి కాదు. ఒకవేళ నేను ఇలాంటి కామెంట్లకు సమాధానం చెప్పకపోతే మీరు మరోలా అర్ధం చేసుకునే అవకాశం ఉంది.

డియర్ అజిత్.. మీ ప్రొఫైల్ చెక్ చేస్తే మీకు ఒక కుమార్తె ఉందని అర్ధమైంది. మీరు మీకుమార్తెను ప్రేమగా దగ్గరకు తీసుకున్న ఫోటో చూశాను. అదే విధంగా నేను కూడా ఓ తండ్రికి కూతుర్నే. ఏదైనా రాసే ముందు ఒకసారి ఆలోచించండి.. మీ మాటలు మమ్మల్ని ఎంత బాధపెడతాయో తెలుసా. నా ఫ్రొఫెషన్ యాక్టింగ్. సినిమాలకు సంబంధించిన విషయాలను ప్రమోట్ చేసుకోవడానికే ఇక్కడ ఉన్నాను కానీ మీకు ఆనందాన్ని ఇవ్వడానికి కాదు అని అపర్ణ నాయర్ నెటిజన్ కి ఘాటుగా సమాధానం ఇచ్చారు.

Next Story

RELATED STORIES