Top

దీపికా పదుకొణె బాడీ గార్డ్ జీతం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

దీపికా పదుకొణె బాడీ గార్డ్ జీతం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
X

అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొణెకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. 'ఓం శాంతి ఓం' మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన దీపికా.. బుగ్గలు సొట్టలు పడే నవ్వుతో.. హుషారైనా స్టెప్పులతో.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అటు హాలీవుడ్ స్టార్స్‌తో కలిసి నటించింది. 2006లో ఉపేంద్ర హీరోగా కన్నడ సినిమా ఐశ్వర్యతో వెండితెరపై అడుగుపెట్టింది దీపికా. ఆ తరువాత ఆమె 2007లో షారుఖ్ ఖాన్ హీరోగా ఫరాఖాన్ తీసిన 'ఓం శాంతి ఓం' మూవీతో పాపులర్ అయ్యింది. రీసెంట్‌గా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడింది. ప్రపంచ వ్యాప్తంగా అశేష ఆదరణ పొందిన ఈ ముద్దుగుమ్మ ఏ ప్రాంతానికి వెళ్ళిన అభిమానుల తాకిడితో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. అయితే దీపికాని గత కొన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు ఆమె బాడీగార్డ్‌ జలాల్‌. ఔట్‌డోర్స్‌కి వెళ్లినప్పుడు దీపికా తప్పనిసరిగా జలాల్ సాయాన్ని కోరుతుంది. అంతేకాదు జలాల్‌ని తన సొంత బ్రదర్‌లా ట్రీట్‌ చేస్తుందట.

అయితే దీపికాని గత కొన్ని సంవత్సరాలుగా కాపాడుతూ వస్తున్న జలాల్‌ జీతం తెలిస్తే ఆశ్చర్యపోతారు! ఎందుకంటే అతను నెలకి అక్షరాలా 6.5 లక్షల రూపాయలు జీతంగా అందుకుంటున్నాడు. అంటే సంవత్సరానికి సుమారు రూ. 80 లక్షలు వరకు ఉంటుంది. అయితే ఈ జీతం ఒకప్పుడూ.. మరి ఇప్పుడు జలాల్ జీతం కోటి రూపాయలకి పైగానే ఉందని బాలీవుడ్ టాక్. ఓ ఎమ్‌ఎన్‌సి కంపెనీలో పనిచేసే టాప్ గ్రేడ్ ఎంప్లొయ్ కి కూడా బహుశా ఇంత శాలరీ ఉండదమో అని అనిపిస్తోందా..! మరి దీపికాని కంటికి రెప్పలా కాపాడుతున్న జలాల్‌కి ఆ మాత్రం ఇవ్వడంలో తప్పేమి లేదని దీపికా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

Next Story

RELATED STORIES