హోండా సంస్థపై సైబర్ అటాక్.. ప్లాంట్ క్లోజ్

హోండా సంస్థపై సైబర్ అటాక్.. ప్లాంట్ క్లోజ్

అసలే లాక్డౌన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జపాన్ కార్ల తయారీ కంపెనీ హోండాకు తాజాగా మరో ఉపద్రవం ఎదురైంది. అంతర్గత సర్వర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ అటాక్ జరిగింది. దాంతో ఇండియా, బ్రెజిల్ హోండా ప్లాంట్లలో కార్యకలాపాలను నిలిపివేసింది. కంపెనీ సిస్టంల ద్వారా వైరస్ వ్యాపించిందని కంపెనీ ప్రతినిధి బుధవారం వెల్లడించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అనేక కర్మాగారాలను ప్రభావితం చేసింది. అయితే ఇది ఎవరు చేశారు అనేదానిపై వివరాలు సేకరిస్తున్నామని ప్రతినిధి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హోండా 11 ప్లాంట్లపై ఈ సైబర్ దాడి ప్రభావం చూపిందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story