coronavirus : భారత్ లో అతిపెద్ద సింగిల్ డే స్పైక్..

X
గత 24 గంటల్లో భారతదేశంలో దాదాపు 10,000 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో ఉంది. దేశంలో నమోదైన కేసుల్లో ఇది అతిపెద్ద సింగిల్-డే స్పైక్ గా ఉంది. మొత్తం 9,996 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,86,579 కు చేరింది. ఇందులో 1,41,028 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ప్రస్తుతం 1,37,448 క్రియాశీల కేసులున్నాయి. అలాగే గత 24 గంటల్లో 357 మరణాలు నమోదయ్యాయి, మొత్తం సంఖ్య 8,102 కు చేరుకుంది. అమెరికా, బ్రెజిల్, రష్యా మరియు యుకె తరువాత కోవిడ్ -19 మహమ్మారికి దెబ్బతిన్న ఐదవ దేశంగా భారత్ నిలిచిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాలు చెబుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
