క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్..

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్..
X

కరోనా మహమ్మారి క్రికెట్ అభిమానుల ఆనందాన్ని ఆవిరి చేసింది. ఎప్పుడో మార్చిలో జరగాలసిన ఐపీఎల్ 13వ సీజన్ వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య నిర్వహించాలని అనుకుంటున్నట్లు ఐపీఎల్ పాలక మండలి చైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు. టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ తుది నిర్ణయం ప్రకటించాక ఐపీఎల్ నిర్వహణపై ప్రణాళికలు రచిస్తామని గురువారం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విదేశాల్లో టోర్నీ నిర్వహించాలనే ఆలోచనైతే ప్రస్తుతానికి లేదని అన్నారు. ప్రేక్షకులు లేకుండా కూడా టోర్నీ నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని బ్రిజేశ్ అన్నారు. క్రికెట్ అభిమానులకు పండగే.. ఐపిఎల్ పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

Next Story

RELATED STORIES