రాత్రికి రాత్రే.. గులాబీ రంగులోకి మారిన సరస్సు

రాత్రికి రాత్రే.. గులాబీ రంగులోకి మారిన సరస్సు

ఓ సరస్సు రాత్రికి రాత్రే రంగు మారింది. అవును మీరు చదువుతున్నది నిజం.. రాత్రికి రాత్రే రంగు మారటంతో స్థానికులు ఆ సరస్సును చూడటానికి గుంపులు గుంపులుగా వస్తున్నారు. మహారాష్ట్రలో జరిగింది ఈ ఘటన.

సుమారు 1.2 కిలోమీటర్ల పరిధిలో వృత్తాకారంలో ఉన్న ఈ లోనార్‌ సరస్సుకు చాలా చరిత్ర ఉన్నది. దాదాపు 50 వేల సంవత్సరాల క్రితం మంచు యుగంలో భూమి ఉపరితలాన్ని తాకిన ఉల్కాపాతం వల్ల లోనార్‌ సరస్సు ఏర్పడింది. అయితే ఈ సరస్సులోని నీరు ఉన్నట్లుండి గులాబీ రంగులోకి మారిపోయింది. లోనార్‌ సరస్సు గులాబీ రంగులోకి మారడం స్థానికులనే కాక శాస్త్రవేత్తలను, నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. ముంబయికి 500 కిలో మీటర్ల దూరంలో బుల్ధన జిల్లాలో ఉన్న లోనార్‌ సరస్సును చూసేందుకు పర్యాటకులతోపాటు శాస్త్రవేత్తలు కూడా ఎక్కువగా వస్తుంటారు. అయితే ఈ సరస్సు రంగు మారడం ఇదే మొదటిసారి కాదంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈసారి బాగా ఎక్కువగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటి లవణీయత, ఆల్గే వల్ల రంగు మారినట్లు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story